Rc.No.: ESE02-12/174/2026-EST 2-CSE తేదీ: 06-11-2026
ఏపీ పాఠశాల విద్యాశాఖ – అధికారుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు, అప్పీళ్ల స్వీకరణకు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఐఏఎస్ గారు 06-11-2026 తేదీన Rc.No.ESE02-12/174/2026 ద్వారా కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
ముఖ్యాంశాలు:
1. Assistant Directors, ప్రభుత్వ మరియు ZP/MPP గ్రేడ్-II ప్రధానోపాధ్యాయులు, MEO, MEO-II, DIET సీనియర్ లెక్చరర్లు, లెక్చరర్లకు సంబంధించిన జోన్ల వారీగా డ్రాఫ్ట్ సీనియారిటీ జాబితాలు విడుదలయ్యాయి.
2. ఈ జాబితాలపై అభ్యంతరాలు, తప్పుల సవరణలు, అప్పీళ్లు సమర్పించేందుకు గతంలో 5 రోజుల గడువు ఇచ్చారు.
3. ఇప్పటివరకు అభ్యంతరాలు అందలేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
4. సంబంధిత అధికారులు వచ్చిన అభ్యంతరాలను తగిన ఆధారాలు, సిఫార్సులతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపాలి.
5. ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే NIL REPORT సమర్పించాలి.
ముఖ్య గమనిక: నిర్దేశిత గడువు తర్వాత అందే అభ్యంతరాలు, అప్పీళ్లను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. దీనికి సంబంధిత RJDSEలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
Download Seniority Lists
Govt. HMs Gr-II Seniority list
